ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘పటాస్’. తొలుత ఈ డిసెంబర్ నెలలో సినిమాను విడుదల చేయాలని భావించారు. ప్రస్తుత పరిస్థుతులలో ఈ నెలలో ‘పటాస్’ ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమనే వార్తలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. సంక్రాంతికి సినిమా విడుదలవుతుందని టాక్.
‘పటాస్’ చిత్రీకరణ 90 శాతం పైగా పూర్తయింది. సోదరుడు జానకి రామ్ మరణంతో మిగతా చిత్రీకరణ వాయిదా పడింది. త్వరలో మిగతా సన్నివేశాలు, ప్యాచ్ వర్క్ ఫినిష్ చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతుంది. కళ్యాణ్ రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. శృతి సోది హీరోయిన్. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఆడియో విడుదల తేది ప్రకటించనున్నారు.


