నందమూరి హీరో టైటిల్ ప్రకటించేది ఎప్పుడంటే..?

నందమూరి హీరో టైటిల్ ప్రకటించేది ఎప్పుడంటే..?

Published on Jul 4, 2019 4:05 PM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రం ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా మెహ్రీన్ నటిస్తుంది. కాగా రేపు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజున పురస్కరించుకొని ఈ మూవీ టైటిల్ ని ప్రకటించనున్నారు. కళ్యాణ్ రామ్ 17వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ పూర్తిగా కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కనుందట.

ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్స్ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగిడనుంది. శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో నిర్మితమౌతున్న ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. తన గత చిత్రాలకు “శతమానంభవతి”, “శ్రీనివాస కళ్యాణం” వంటి అచ్చ తెలుగు పేర్లు పెట్టిన దర్శకుడు సతీష్ ఈ సారి కళ్యాణ్ రామ్ చిత్రానికి ఎటువంటి ట్రెడిషనల్ టైటిల్ ఫిక్స్ చేస్తాడోనని కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు