
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. అవే ‘పటాస్’ మరియు ‘షేర్’. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న పటాస్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ముందుగా పటాస్ సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనతో కళ్యాణ్ రామ్ ముందు ఆ సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తున్నాడు.
కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి ఫాదర్ గా సాయి కుమార్ కనిపించనున్నాడు. కళ్యాణ్ రామ్ సరసన శృతి సోది హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు.