‘కిక్ 2’పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న కళ్యాణ్ రామ్

‘కిక్ 2’పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న కళ్యాణ్ రామ్

Published on Aug 11, 2015 5:25 PM IST

kick2
ఇప్పటి వరకూ తను నటించే సినిమాలకే నిర్మాతగా వ్యవహరించిన యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మొదటి సారిగా వేరే స్టార్ హీరోతో చేసిన సినిమా ‘కిక్ 2’. మాస్ మహారాజ రవితేజ హీరోగా 2009లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కిక్ సినిమాకి సీక్వెల్ ఈ ‘కిక్ 2’. మొదటి పార్ట్ కి దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డినే ఈ సీక్వెల్ కి కూడా దర్శకుడు. రవితేజ – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమా ఆగష్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అందులో భాగంగానే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ముందుగా ఆగష్టు 14న గ్రాండ్ గా ప్లాటినం డిస్క్ వేడుకని కూడా చేయనున్నారు.

ఈ చిత్ర నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ ఈ సినిమా సక్సెస్ పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అలాగే ఆయన సన్నిహితులు చెప్పిన సమాచారం ప్రకారం ‘కిక్ 2 లో కిక్ సినిమాని మించి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. థియేటర్స్ లో ఆడియన్స్ భీభత్సంగా నవ్వుకుంటారు. బ్రహ్మానందం కామెడీ సినిమాకి ఓ మేజర్ హైలైట్ అవుతుంది. అంతే కాకుండా ఈ ఏడాది ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కి మరో హిట్ వస్తుందని’ కళ్యాణ్ రామ్ తెలిపినట్లు చెప్పారు. అన్ని పనులను పూర్తి చేసిన ఈ చిత్ర టీం ఈ మూవీ ప్రమోషన్స్ కోసం సరికొత్త ప్లాన్స్ వేస్తోంది. ఈ చిత్ర టీం అంతా కలిసి గ్రాండ్ గా ఈ సినిమాని ప్రమోట్ చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ లో ‘కిక్కు కిక్కు’ అంటూ ప్రేక్షకులను తెగ నవ్వించిన రవితేజ ఈ సారి కంఫర్ట్ కంఫర్ట్ అంటూ నవ్వించనున్నాడు.

తాజా వార్తలు