ఎన్టీఆర్ కి ‘బృందావనం’.. నాకు ‘నా నువ్వే’ : కళ్యాణ్ రామ్
Published on Jun 13, 2018 11:36 am IST

కళ్యాణ్ రామ్ నటించిన ‘నా నువ్వే’ చిత్రం రేపే విడుదలకానుంది. పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండనుంది. ఇన్నాళ్లు మాస్ ఎంటర్టైనర్స్, కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా ఇలా రొమాంటిక్ హీరోగా మారిపోవడంతో సినిమా ఎలా ఉంటుందో, కళ్యాణ్ రామ్ కొత్త ప్రయత్నం ఆకట్టుకుంటుందో లేదో అని కొందరిలో సందేహాలు మొదలయ్యాయి.

కానీ కళ్యాణ్ రామ్ మాత్రం సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఇన్నాళ్లు తనకు కమర్షియల్ సినిమాలు మాత్రమే వచ్చాయి కాబట్టి చేశానని, ఎవరైనా సరే ప్రయత్నం చేస్తే కానీ సక్సెస్ అవుతారో లేదో చెప్పలేమని అన్నారు. అంతేగాక ఆరంభం నుండి మాస్ సినిమాలే చేస్తూ వచ్చిన ఎన్టీఆర్ ‘బృందావనం’తో క్లాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయి ఆ తరవాత ‘నాన్నకు ప్రేమ’తో వంటి హిట్ సినిమా చేశారని, ఆయనకు ‘బృందావనం’ ఎలాగో తనకు ‘నా నువ్వే’ అలాగని మంచి ఉదాహరణిచ్చారు.

 
Like us on Facebook