ఆగష్టులో షూట్ స్టార్ట్ చేయనున్న నందమూరి హీరో !

Published on Jun 2, 2019 1:11 pm IST

కళ్యాణ్ రామ్ తన తరువాత సినిమాను సతీష్ వేగేశ్నతో చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆగష్టు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందట. కాగా ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘తుగ్లక్’ సినిమాలో నటిస్తున్నాడు.

ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మతో కళ్యాణ్ రామ్ సినిమా చేయనున్నాడు. అయితే విరించి వర్మ సినిమా ‘తుగ్లక్’ సినిమా తరువాత మొదలవ్వాల్సి ఉన్నా… సతీష్ వేగేశ్న చెప్పిన స్క్రిప్ట్ బాగుండటంతో ముందుగా ఆ సినిమా స్టార్ట్ అవుతుంది.

సంబంధిత సమాచారం :

More