బింబిసార’ మరో ‘ఆదిత్య 369’ అవ్వగలదా ?

Published on May 28, 2021 11:50 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం ‘బింబిసార’. చాలా రోజుల నుండి గోప్యంగా ఉంచిన ఈ ప్రాజెక్టును ఈరోజే అధికారికంగా అనౌన్స్ చేశారు. షూటింగ్ కూడ కొంత ముహించారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఉండనుంది. వశిష్ట్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మగధ సామ్రాజ్య మహారాజు బింబిసార పాత్రను పోషిస్తున్నారు. సినిమా కాన్సెప్ట్ వింటే బాలకృష్ణ ‘ఆదిత్య 369’ గుర్తుకువస్తోంది. అందులో కూడ సోషియో ఫాంటసీ సినిమానే. బాలకృష్ణ టైమ్ ట్రావెల్ చేసి శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్తారు. కళ్యాణ్ రామ్ సినిమాలో కూడ టైమ్ ట్రావెల్ తో పాటు బింబిసార రాజు కథ ఉంది.

ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఎవ్వరూ కూడ బింబిసార మహారాజు చరిత్రను టచ్ చేయలేదు. నిజానికి ఆయన కథలో చాలా విశేషాలే ఉన్నాయి. 15 ఏళ్ల వయసుకే సింహాసనాన్ని అధిష్టించడం, మగధ సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తరించడం, గౌతమ బుద్ధినితో స్నేహం, అశేషమైన నిధి నిక్షేపాలను కొండ గుహలో దాచిపెట్టడం, ఇంతవరకు ఎవ్వరూ చివరికి బింబిసార కుమారుడు అజాతశత్రు కూడ ఆ నిధిని కనుగొనలేకపోవడం, బింబిసార చివరికి కుమారుడి చేతిలోనే బందీ కాబడి మరణించడం లాంటి అనేక ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. మరి వీటిలో కళ్యాణ్ రామ్ చిత్రం ఏ అంశాన్ని టచ్ చేస్తున్నారు, చేస్తే ‘ఆదిత్య 369’ తరహాలోనే ప్రజెంట్ చేస్తారా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :