డాషింగ్ డైరెక్టర్ ‘పూరి జగన్నాథ్’ దర్శకత్వంలో ‘నందమూరి కళ్యాణ్ రామ్’ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇజం’. ఎప్పటికప్పుడు తన సినిమాల్లో వైవిధ్యం కనబరచి పూరి ఈ చిత్రం విషయంలో మొదటి నుండీ అదే ఫాలో అవుతున్నారు. మొదటగా రిలీజ్ చేసిన పోస్టర్లతోనే సినిమా మాస్ కంటెంట్ తో ఫుల్లుగా లోడై ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ దశలో ఉంది. ఈ క్లైమాక్స్ పార్ట్ ను పూరీ ప్రత్యేకంగా గోల్కొండ కోటాలో తెరకెక్కిస్తున్నాడు.
ఈ ఎపిసోడ్ మొత్తం చిత్రానికే హైలెట్ గా నిలుస్తుందని, పైగా పూరి తాను ఇక్కడే డైరెక్ట్ చేసిన పోకిరి ఘన విజయ సాధించడంతో ఆ సెంటిమెంట్ తోనే షూటింగ్ ను గోల్కొండలో ప్లాన్ చేశాడాని తెలుస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఒక జర్నలిస్టుగా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం ఈ నందమురి హీరో సిక్స్ ఫ్యాక్ కూడా ట్రై చేస్తున్నాడు. దీనికి సంబందించిన లుక్స్ సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలకానున్నాయి. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ స్వయంగానిర్మిస్తున్న ఏ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


