సెన్సార్ కు సిద్దమైన కళ్యాణ్ రామ్ ‘ఎం.ఎల్.ఏ’ !
Published on Mar 14, 2018 1:04 pm IST


కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సినిమా ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ (ఎం.ఎల్.ఏ) చివరి దశ పనుల్లో ఉంది. చిత్ర యూనిట్ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రాన్ని సెన్సార్ కార్యక్రమాలకి సిద్ధం చేసింది. రేపే ఈ సెన్సార్ పనులు జరగనున్నాయి.

ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో చిత్రంపై అంచనాలు పెరిగాయి. కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో పొలిటీషియన్ గా కనిపించనున్నాడు. మార్చి 17న కర్నూలులో చిత్ర ఆడియో వేడుక జరగనుంది. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఉపేంద్ర మాధవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 23న ప్రేక్షకుల ముందుకురానుంది.

 
Like us on Facebook