ఇంటెన్స్ ‌లుక్ ట్రై చేస్తోన్న కళ్యాణ్ రామ్ !

ఇంటెన్స్ ‌లుక్ ట్రై చేస్తోన్న కళ్యాణ్ రామ్ !

Published on Apr 3, 2021 4:06 PM IST

నందమూరి హీరో కల్యాణ్‌రామ్‌ హీరోగా, రాజేంద్ర అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపించబోతున్నాడట. బాల్డ్ నెస్ లుక్ లో కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని.. మొత్తానికి కళ్యాణ్ రామ్ మాస్ లుక్ చాలా ఇంటెన్స్ ‌గా ఉంటుందని.. నందమూరి అభిమానులను లుక్ సర్‌ప్రైజ్‌ చేస్తోందని తెలుస్తోంది.

కాగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకం పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణను‌ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాలో ఎమోషనల్ డ్రామా చాలా బాగుంటుందని.. అలాగే ఇంటర్వెల్ లో వచ్చే కళ్యాణ్ రామ్ సెకెండ్ రోల్ మొత్తం సినిమానే టర్న్ చేస్తోందని సమాచారం. అయితే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక కల్యాణ్‌రామ్‌ చివరిగా సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ‘ఎంత మంచి వాడవురా’ చిత్రంలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు