మల్టీ స్టారర్ కు సిద్దమవుతున్న కళ్యాణ్ రామ్ !
Published on Jun 13, 2018 11:13 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలో పవన్ సాతినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే మొదలుకానుంది. ఈ చిత్రంలో తారక్, హరిక్రిష్ణ ఇద్దరూ కనిపిస్తారని గతంలో వార్తలు రాగా వాటిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. తాజాగా ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఇదొక మల్టీ స్టారర్ గా ఉండబోతోందని తెలిపారు.

అలాగే తనతో పాటు నటించబోయే హీరో ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదని, ముగ్గురు నలుగురు హీరోలను అనుకుంటున్నామని, ఫైనల్ డెసిషన్ రాగానే అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మించనున్నారు. ఇకపోతే ఆయన నటించిన ‘నా నువ్వే’ చిత్రం రేపు 14న విడుదలకానుంది.

 
Like us on Facebook