వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా నటిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. రవి లోకిరెడ్డి దర్శకత్వంలో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. చిత్ర టైటిల్ ఆకట్టుకునేలా ఉందని, దర్శకుడి ఆలోచనా విధానం పోస్టర్‌లో కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రేమ, సస్పెన్స్ అంశాల నేపథ్యంతో ఉత్కంఠభరితంగా ఈ కథను రూపొందించినట్లు దర్శకుడు రవి లోకిరెడ్డి తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా తమ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడం పట్ల నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రాజవంశీ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందించగా, డి.వెంకటరాజు ఛాయాగ్రహణం సమకూర్చారు.



