కేరళ బ్యూటీ తెలుగులో మరో సినిమాకి సైన్ చేసిందా ?

Published on Apr 16, 2019 12:26 pm IST

హలో తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కేరళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్. ఈ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్ తో చిత్రలహరి లో నటించింది. ఇటీవలె ఈ చిత్రం విడుదలైయింది. ఇక ఈ చిత్రం తరువాత ప్రస్తుతం కోలీవుడ్ లో కార్తి సరసన ఓ సినిమాలో అలాగే మలయాళంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా వుంది.

ఇక తాజాగా తెలుగులో కళ్యాణి మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల, యంగ్ హీరో నితిన్ తో భీష్మ అనే చిత్రం తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక ను కథానాయికగా తీసుకోగా మరో హీరోయిన్ కోసం కళ్యాణి ని ఎంపిక చేసారని సమాచారం. అయితే ఈ వార్తలఫై అధికారికంగా సమాచారం రావాల్సి వుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక కళ్యాణి ఇటీవలే శర్వానంద్ గ్యాంగ్ స్టర్ డ్రామా షూటింగ్ ను పూర్తి చేసింది. సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈచిత్రం మే లేదా జూన్ లో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

సంబంధిత సమాచారం :