మరోసారి తన రాకను కన్ఫర్మ్ చేసిన కళ్యాణ్ రామ్

Published on Nov 9, 2019 1:00 am IST

కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 15న విడుదల చేయాలని ఛాన్నాళ్ల కృతమే అనుకున్నారు టీమ్. కానీ ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకాన్నట్లు ఆయా చిత్రాల నిర్మాతలు ప్రకటించారు. వీటితో పాటే రజనీకాంత్ యొక్క ‘దర్బార్’ కూడా సంక్రాంతి పండుగనే టార్గెట్ చేసింది.

దీంతో ఇన్ని పెద్ద సినిమాల మధ్యన ‘ఎంతమంచి వాడవురా’ వస్తుందా..రాదా అనే అనుమానం మొదలైంది ప్రేక్షకుల్లో. డానికి తోడు చిత్ర బృందం కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. అందుకే కళ్యాణ్ రామ్ స్వయంగా స్పందిస్తూ సినిమాను జనవరి 15వ తేదీనే విడుదల చేయనున్నట్లు మరోసారి కన్ఫర్మ్ చేస్తూ ప్రకటన ఇచ్చారు. దీంతో అనుమాలన్నీ చెరిగిపోయాయి. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :