కళ్యాణ్ రామ్ “ఎంత మంచివాడవురా”…!

కళ్యాణ్ రామ్ “ఎంత మంచివాడవురా”…!

Published on Jul 5, 2019 8:50 AM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రం ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా మెహ్రీన్ నటిస్తుంది. కాగా నేడు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజున పురస్కరించుకొని ఈ మూవీ టైటిల్ లోగోని చిత్రబృందం విడుదల చేసింది. కళ్యాణ్ రామ్ 17వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి “ఎంత మంచివాడవురా” అనే క్లాసిక్ టైటిల్ నిర్ణయించారు.తన గత చిత్రాలకు “శతమానంభవతి”, “శ్రీనివాస కళ్యాణం” వంటి అచ్చ తెలుగు పేర్లు పెట్టిన దర్శకుడు సతీష్ ఈ సారి కళ్యాణ్ రామ్ చిత్రానికి కూడా అలాంటి ట్రెడిషనల్ టైటిల్ నే ఎంచుకోవడం గమనార్హం.

పూర్తిగా కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కనున్న “ఎంత మంచివాడవురా” చిత్రాన్ని ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమేష్ గుప్తా నిర్మిస్తుండగా ,శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు