కమల్ హాసన్ అభిమానుల ఆందోళన..!

Uttamavillain
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించి, నిర్మించిన సినిమా ‘ఉత్తమ విలన్’. ఎప్పట్నుంచో వివాదాలను ఎదుర్కొంటూ వస్తోన్న ఈ సినిమా చివరకు అన్ని అడ్డంకులను దాటి నేడు (మే 1న) విడుదలకు సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో తలెత్తిన కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఈ సినిమాకు సంబంధించి ఎర్లీ షోస్, మార్నింగ్, మ్యాట్నీ షోస్ అన్నీ కాన్సల్ అయ్యాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడులతో పాటు కర్ణాటకలో కూడా ఈ సినిమా కోసం అభిమానులు సిద్ధమయ్యారు. కాగా చివరి నిమిషంలో షో కాన్సిల్ అయిన విషయం తెలియడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ఇక తమిళనాడులో కొందరు కమల్ హాసన్ అభిమానులైతే ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. తమ హీరో సినిమా విడుదలకు కాకూడదనే అడ్డంకులు కల్పిస్తున్నారంటూ ఆందోళన చేశారు. చెన్నైలోని అన్ని ప్రాంతాల్లో సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసిన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా ఈ సినిమా సాయంత్రం షోలపై కూడా ఇంకా ఓ స్పష్టత రాలేదు. చిత్ర యూనిట్ వర్గాలు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతం కొన్ని సర్దుబాట్లు జరుగుతున్నాయని, అన్ని సమస్యలు సమసిపోయి ఈ సాయంత్రం కల్లా సినిమా విడుదలవుతుందని తెలిపాయి.

Exit mobile version