‘కమల్- మణిరత్నం’ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Feb 21, 2023 12:31 am IST

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నంతో మళ్ళీ చాన్నేళ్లకి ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం కమల్ కెరీర్ లో 234వ చిత్రం. ఈ చిత్రానికి సహ నిర్మాతలలో కమల్ కూడా ఒకరు. కాగా ఈ సినిమా చారిత్రాత్మక కథ కాకుండా, సోషల్ మెసేజ్ మూవీ అని, తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారసులు ఎలా ఉండాలి ? అనే అంశంతో ఈ సినిమా సాగుతుందట. ఐతే, ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ నుంచి మొదలు కానుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ఇది వరకే “చీకటి రాజ్యం” అనే చిత్రం ఈ కాంబినేషన్ లో వచ్చింది. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఈ కాంబోలో మరో సినిమా రాబోతుంది. ఐతే, ఈ వార్త పై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మణిరత్నం పొన్నియన్ సెల్వన్- 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారు.

సంబంధిత సమాచారం :