సింగీతం కోసం లోకనాయకుడు.. అంచనాలు పెంచేస్తున్నారుగా..!

సింగీతం కోసం లోకనాయకుడు.. అంచనాలు పెంచేస్తున్నారుగా..!

Published on Jun 6, 2026 6:00 PM IST

విలక్షణ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సింగ్ గీతం’. అయాన్, అహల్య బమ్రూ, శాలినీ కొండెపూడి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నిర్మాత నాగ్‌ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోంది. ఇందులో భాగంగా రేపు చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా లోకనాయకుడు, స్టార్ హీరో కమల్ హాసన్ హాజరుకానున్నారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా ఆయన ఈ ఈవెంట్‌కు విచ్చేస్తుండటం విశేషం.

చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘సింగ్ గీతం’ చిత్రం జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సింగీతం మార్క్ మేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

తాజా వార్తలు