
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన ‘ఉత్తమ విలన్’ మే 1న విడుదలై విమర్శకులను మెప్పించింది. ఇది కాకుండా కమల్ నటించిన ‘విశ్వరూపం 2’, ‘పాపనాశం’ సినిమాలు కూడా రిలీజ్ కి సిద్దమవుతున్నాయి. ఆ సినిమాలని పక్క పెడితే కమల్ హాసన్ ఓ యాక్షన్ థ్రిల్లర్ కథని సిద్దం చేస్తున్నారని ఇది వరకే తెలియజేశాం. ఒకే ఒక్క రాత్రి కమల్ లైఫ్ లో ఏం జరిగింది అనే పాయింట్ పై ఈ సినిమా ఉండనుంది. అందుకే ఈ సినిమాకి ‘ఒరే ఇరవు’ అనే టైటిల్ ని పెట్టారు. ఒరే ఇరవు అనగా ఒకే రాత్రి అని అర్థం.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ ఓ ముఖ్య పాత్రలో నటించనుందని సమాచారం. తనెవరో కాదు బొంబాయి సినిమాతో సౌత్ ఇండియన్ ప్రేక్షకులను మెప్పించిన మనీషా కొయిరాల. ఈ సినిమాలో కమల్ కి భార్యగా ఓ ముఖ్యమైన పాత్ర ఉంది. ఆ పాత్ర నిడివి చాలా తక్కువ అయినప్పటికీ సినిమాలో చాలా కీలకం కావడం వలన ఈ చిత్ర టీం మనీషా కొయిరాలని అప్రోచ్ అయినట్లు సమాచారం. కానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. త్వరలోనే కమల్ లేదా మనీష కొయిరాల నుంచి ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా కమల్ ఈ సినిమాతో తన సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన రాజేష్ కి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చాడు.