తన జీవితాన్ని సినిమాకే అంకితం చేసిన అతి కొద్ది మంది నటులలో కమల్ హాసన్ ఒకరు. 60 ఏళ్ళ కమల్ జీవితంలో 50 ఏళ్ళు జ్ఞాపకాలు సినిమా రంగంతోనే ముడిపడి ఉన్నాయి. ఈ సినీ ప్రయాణంలో ఎన్నో అద్బుతమైన చిత్రాలు, మరెన్నో ప్రయోగాలు, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు. ఇండియాలో గర్వించదగ్గ నటులలో ఒకరైన కమల్ గురించి తెలుసుకోవాలనే కోరిక ప్రేక్షకులలో ఉండడం సహజం. అది త్వరలో తీరబోతుంది.
‘సిటిజన్ కె’ పేరుతో కమల్ సినీ జీవితంలో జరిగిన విశేషాలను పుస్తక రూపంలో తీసుకువస్తున్నారు. కమల్ సన్నిహిత మిత్రుడు, జర్నలిస్ట్ అయిన హరిహరన్ ఈ పుస్తకాన్ని రచిస్తున్నారు. ఈ పుస్తకంలో కేవలం కమల్ సినీ జీవితం గురించి మాత్రమే ఉంటుంది.
స్వతహాగా తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించడానికి ఇష్టపడని కమల్, సినీ జీవితంపై వస్తున్న పుస్తకం కావడంతో ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.


