కేరళ వరద భాదితులకు మన హీరోలు సాయం !

Published on Aug 13, 2018 5:58 pm IST

కేరళలో ప్రస్తుతం వ‌ర‌ద‌ల‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. వరద భాదితులకు సహాయార్ధం కొరకు మన స్టార్ హీరోలు ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ 25 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించగా యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా రూ.5 ల‌క్ష‌లను అందించి తన సేవా దృక్పధాన్ని చాటుకున్నాడు.

కాగా తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కేర‌ళలోని వరద బాధితుల‌కు సాయంగా రూ.25 ల‌క్ష‌ల్ని ప్ర‌క‌టించి తన అభిమానాలకు ప్రేరణగ నిలిచాడు. అలాగే ఇటీవలే సూర్య‌, కార్తి లు కూడా 25 లక్షల మొత్తాన్ని అందించారు.

సంబంధిత సమాచారం :

X
More