ఓ భారీ చిత్రంకై చేతులు కలిపిన కమల్,రెహమాన్.

ఓ భారీ చిత్రంకై చేతులు కలిపిన కమల్,రెహమాన్.

Published on Jul 16, 2019 3:55 PM IST

లోకనాయకుడు కమల్ హాసన్ మరియు లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఓ భారీ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులు కానున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. నిన్న రెహమాన్ నివాసంలో కలిసిన ఈ ఇద్దరు ప్రముఖులు ఈ విషయాన్నీ ధ్రువీకరించడం జరిగింది. “తలైవన్ ఇరుకిండ్రాన్” అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ చిత్రీకరణ సెప్టెంబర్ లో ప్రారంభించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 ఏప్రిల్ లో వేసవి కానుకగా విడుదల చేయాలనీ ప్రణాళికలు వేయడం జరిగింది.

ఐతే ఈ చిత్రానికి సంబధించి నటులు,సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్,లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఐతే కమల్ ఈ చిత్రంలో హీరోగా చేస్తారా లేకా కేవలం నిర్మాతగానే ఉంటారా అనేది తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు