
విశ్వ నటుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన తాజా సినిమా ‘ఉత్తమ విలన్’. కమల్ సరసన పూజా కుమార్, ఆండ్రియాలు హీరోయిన్లుగా నటించారు. జిబ్రాన్ సంగీత దర్శకుడు. ‘ఉత్తమ విలన్’ ఆడియోలో ఏడు పాటలు ఉన్నాయి. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మార్చి 1న చెన్నై నగరంలో చెన్నై ట్రేడ్ సెంటర్ లో జరగనుంది.
ఈ ఆడియో వేడుకలో ఇద్దరు హీరోయిన్లతో పాటు కమల్ హాసన్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక, అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. లీడ్ పెయిర్ తో పాటు ఫేమస్ అట్టకలారి డాన్స్ గ్రూప్ కూడా లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనుంది. ప్రస్తుతం వీరు రిహర్సేల్స్ చేస్తున్నారు.
రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలను కమల్ అందించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, లింగుస్వామి తిరుపతి బ్రదర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తుంది. తిరుపతి బ్రదర్స్ నిర్మాతలు.

