బిగ్ బాస్ 3హోస్ట్ గా డాన్ లుక్ లో ఆయన్ని చూశారా?

Published on Jun 22, 2019 5:21 pm IST

తమిళ బిగ్ బాస్-3 మొదలు కావడానికి ఇంకా రెండురోజులే మిగిలి ఉంది. ఇంటిలో సెలెబ్రిటీ హౌస్ మేట్స్ చేసే స్పైస్ కామెంట్స్,క్రేజీ ఈవెంట్స్ కొరకు బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొదటి రెండు సీజన్స్ సూపర్ సక్సెస్ కావడంతో ఈ సీజన్ పైన కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. నటి కస్తూరి, రాధారవి, ప్రేమ్ జీ,పూనమ్ బాజ్వా, చాందిని, మధుమిత, మోహన్ వైద్య, శక్తి చరణ్, సంతానభారతీ, శ్రీమాన్ర, మేష్ తిలక్, మృణాలిని, శ్రీగోపిక, విజయ్ టీవీ రమ్య,గాయకుడు క్రిష్ బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ అంటూ ఓ లిస్ట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.షో నిబంధనల ప్రకారం హౌస్ లోకి ప్రవేశించే వరకు కంటెస్టెంట్స్ ఎవరనేది రహస్యం కాబట్టి సోమవారం వరకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరనేది తెలియదు.

ఇక గత రెండు సీజన్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన లోకనాయకుడు కమల్ హాసనే బిగ్ బాస్ 3కి కూడా హోస్ట్ గా చేస్తున్నారు. గంభీరమైన స్వరం,ఆకట్టుకొనే మాటతీరు,సభ్యులను చక్కగా మేనేజ్ చేయడంతో ఆయన షోని విజయపథంలో నడుపుతున్నారు. లేటెస్ట్ బిగ్ బాస్ 3 హోస్ట్ గా ఆయన లుక్ చుస్తే మతిపోవాల్సిందే. మెలితిప్పిన మీసం,బ్లాక్ కోట్ ,గ్లాసెస్ పెట్టుకొని గోల్డ్ కలర్ సోఫా లో కూర్చున్న ఆయన అండర్ వరల్డ్ డాన్ లా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More