వంద కోట్ల బడ్జెట్‌తో కమల్‌హాసన్ కొత్త మూవీ..!

Published on Jul 1, 2021 2:38 am IST


గత కొద్ది కాలంగా రాజకీయాల్లో బిజీగా గడిపిన తమిళ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తిరిగి మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ఇండియన్‌-2’, ‘విక్రమ్‌’ సినిమాల్లో నటిస్తున్న కమల్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాకాముైట్టె, విశారణై, అసురన్‌ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్‌తో సినిమా చేసేందుకు కమల్ సిద్దమయ్యాడట.

అయితే తమిళంలో ప్రసిద్ధి పొందిన ఓ నవల ఆధారంగా దర్శకుడు వెట్రిమారన్ ఓ కథను సిద్దం చేసి కమల్‌కి వినిపించాగా, కథలో కొత్తదనం కనిపించడంతో ఆ సినిమా చేసేందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే దాదాపు వంద కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే త్వరలో ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :