‘చీకటి రాజ్యం’ ప్రీమియర్‌కు ఏపీ సీఎం!

‘చీకటి రాజ్యం’ ప్రీమియర్‌కు ఏపీ సీఎం!

Published on Nov 12, 2015 4:40 PM IST

kamal-babu
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చీకటి రాజ్యం సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. తమిళంలో దీపావళి కానుకగా నవంబర్ 10నే విడుదలైన ఈ సినిమా తెలుగు వర్షన్ మాత్రం అఖిల్ సినిమాకు ఫ్రీ రన్ కల్పించేందుకు నవంబర్ 20వ తేదీకి ఫిక్స్ అయింది. ఇక తమిళ వర్షన్ తూంగవనంకు సూపర్ రెస్పాన్స్ రావడమే కాకుండా మంచి కలెక్షన్స్‌తో హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే కమల్, తెలుగు వర్షన్ రిలీజ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఆయన నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విజయవాడలో చీకటి రాజ్యం సినిమాకు సంబంధించి ఒక ప్రీమియర్ షో ఏర్పాటుకు అనుమతించవలసిందిగా కోరారు. అదేవిధంగా ఆ ప్రీమియర్ షోకు చంద్రబాబును కమల్ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కమల్ ఆహ్వానానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. విజయవాడలో సినిమా రిలీజ్‌కి ముందు రోజు ఈ ప్రీమియర్ షో ఏర్పాటు చేయనున్నారు. ఇక అదే రోజు హైద్రాబాద్‌లో ఆరు గంటల తేడాలో మరో ప్రీమియర్ షోను కూడా ఏర్పాటు చేస్తామని, తాను ఆ రెండింటికీ హాజరువుతానని కమల్ ఈ సందర్భంగా తెలిపారు.

త్రిష, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాజేష్ ఎమ్. సెల్వ దర్శకత్వం వహించారు. ఒకే ఒక్కరాత్రి జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ రేసీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు