కమల్, నాగార్జున, బన్నీ.. ‘సికిందర్’ ఆడియోకి అతిధులు.

కమల్, నాగార్జున, బన్నీ.. ‘సికిందర్’ ఆడియోకి అతిధులు.

Published on Jul 27, 2014 7:23 PM IST

sikandar

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘అంజాన్’. తెలుగు ‘సికిందర్’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే తమిళ ఆడియో విడుదలవగా తెలుగు ఆడియో జూలై 31న విడుదల అవుతుంది. ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కమల్ హాసన్, కింగ్ నాగార్జున, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరవుతున్నారు.

సూర్య సరసన సమంత చాలా గ్లామరస్ పాత్రలో నటించింది. ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారి ఎత్తున విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్‌లక్ష్మి సినీ క్రియేషన్స్‌, తిరుపతి బ్రదర్స్‌ పతాకాలపై శిరీషా-శ్రీధర్‌, ఎన్‌. సుభాష్‌చంద్రబోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు