న్యూ ఇయర్ కానుకగా కమల్ ‘ఉత్తమ విలన్’ ట్రైలర్

న్యూ ఇయర్ కానుకగా కమల్ ‘ఉత్తమ విలన్’ ట్రైలర్

Published on Dec 31, 2014 8:20 AM IST

Uttama-Villain

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ‘ఉత్తమ విలన్’. కమల్ హాసన్ ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేసారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లోని పారామౌంట్ స్టూడియోస్ లో సౌండ్ మికిసింగ్ చేస్తున్నారని కమల్ హాసన్ తెలియజేసారు.

అలాగే మాట్లాడుతూ ‘ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి, ఫస్ట్ ట్రైలర్ కూడా సిద్దమైంది. 2015 న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నట్లు’ కమల్ హాసన్ తెలియజేశారు. యువ సంచనలనం జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఉత్తమ విలన్ ఆడియో రైట్స్ ని ఎరోస్ వారు ఫ్యాన్సీ అమౌంట్ కి సొంతం చేసుకున్నారు. ఇందులో కమల్ హాసన్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. అవే మలయాళంలో ఫేమస్ అయిన తెయ్యమ్‌ కళాకారుడిగా, మరొకటి సినిమా నటుడిగా కమల్‌హాసన్‌ కనిపిస్తాడు.

రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కె. బాలచందర్, పూజ కుమార్, ఆండ్రియా, పార్వతి, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ – రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. ఇది కాకుండా కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ సినిమా త్వరలో విడుదల కానుంది.

తాజా వార్తలు