రేపు విడుదల అవడానికి చట్టపరమైన అడ్డంకులను దాటిన విశ్వరూపం 2 !

Vishwaroopam

కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘విశ్వరూపం 2’. ఆగస్టు 10 న ఈ చిత్రం విడుదల సందేహాస్పదంగా ఉందనే వార్త రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తోంది. విడుదల అవ్వకపోవడానికి పిరమిడ్ సైమిర‌ తనకు రావాల్సిన బకాయి కొరకు కోర్టులో పిటిషన్ వేయటం ఒకటైతే.. తమిళనాడు రాజకీయ దిగ్గజం మహోన్నత నేత కరుణానిధి మరణం కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని కమల్‌ భావిస్తున్నారనే వార్త మరొకటి.

కాగా ఆగస్టు 10న తమిళ, తెలుగు మరియు హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల అవ్వబోతున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు పిరమిడ్ సైమిర‌ పిటిషన్ ను తిరస్కరించింది. కమల్ హాసన్ పిరమిడ్ సైమిర‌కు చెల్లించాల్సిన రూ .7.75 కోట్లు బాకాయి చెల్లించారు. దానితో ఇక విడుదల పై ఎలాంటి అనుమానాలు లేవు. ఆండ్రియా, పూజా కుమార్, రాహుల్ బోస్, శేఖర్ కపూర్ వంటివారు నటిస్తోన్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు.

Exit mobile version