‘కాంచన 2’ విడుదల తేదీ ఖరారు!

‘కాంచన 2’ విడుదల తేదీ ఖరారు!

Published on Apr 8, 2015 3:26 PM IST

kanchana-2
హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘కాంచన’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ‘ముని’ సినిమాకు సీక్వెల్‌గా ‘కాంచన’ తెరకెక్కగా, ఇప్పుడా సిరీస్‌లో మూడో సినిమా ‘కాంచన 2’ విడుదలకు సిద్ధమైంది. నృత్య దర్శకత్వం నుంచి నేరుగా సినిమా దర్శకత్వానికి షిఫ్ట్ అయిన రాఘవ లారెన్స్ దర్శకుడిగానూ మంచి విజయాలను నమోదు చేశారు. ఆయన కెరీర్లో ‘కాంచన’, ‘ముని’ సినిమాలు గుర్తుంచుకోదగ్గ సినిమాలుగా చెప్పుకోవచ్చు.

తాజాగా ‘కాంచన 2’ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఈ ఉదయం పూర్తయ్యాయి. తమిళంలో ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ అయింది. త్వరలోనే తెలుగు వెర్షన్‌కు సంబంధించిన సెన్సార్ కూడా జరగనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 17న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తాప్సీ, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించగా, బెల్లంకొండ్ సురేష్ ఈ సినిమాను నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు