‘కాంచన 3’.. మామూలు హిట్ కాదు !

Published on May 21, 2019 8:10 pm IST

‘ముని, కాంచన’ సినిమాల ప్రాంచైజీలో వచ్చిన కొత్త చిత్రం ‘కాంచన 3’. రాఘవ లారెన్స్ నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 19 న భారీ ఎత్తున విడుదలైంది. క్లాస్ ప్రేక్షకులకు అంతగా నచ్చకపోయినా మాస్ ఆడియన్స్ మాత్రం సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఒక్క తమిళనాడులో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా చిత్రానికి మంచి ఆదరణ దక్కింది.

తమిళ ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఒక్క తమిళనాడులోనే 70 కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టి ఇప్పటికీ కొన్ని చోట్ల రన్ అవుతోంది. ఈ భారీ విజయంతో చిత్రం ఈ వేసవి హిట్ సినిమాల జాబితాలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ఇక లారెన్స్ అయితే ఈ ప్రాంచైజీ ఇప్పుడప్పుడే ఆగదని, ఇంకొన్ని సినిమాలు తీస్తానని గతంలోనే ప్రకటించేశారు.

సంబంధిత సమాచారం :

More