సినిమాని మన తెలుగు ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొత్త రిలీజ్ లు అయినా రీరిలీజ్ లు అయినా కూడా మన దగ్గర అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. అలా చాలా రోజులు తర్వాత ఓ రీరిలీజ్ ని సెలబ్రేట్ చేస్తున్నారు అంటే అది రాఘవ లారెన్స్ “కాంచన” సినిమా అని చెప్పాలి. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ సినిమా తెలుగులో అప్పుడు సంచలన విజయం సాధించింది.
మరి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రీరిలీజ్ కి వచ్చి కూడా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. మొదటి రోజే 3 కోట్లకి పైగా గ్రాస్ ని ఈ సినిమా అందుకోగా ఇప్పుడు మొత్తం మూడు రోజుల రన్ ని పూర్తి చేసుకొని మూడు రోజుల్లో 5.54 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుని తెలుగు రీరిలీజ్ లలో అదరగొట్టింది. మరి ఈ మార్క్ ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో లక్ష్మి రాయ్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే బెల్లంకొండ సురేష్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
