కాంచన 3 కూడా జెర్సీ బాటలో… !

Published on Apr 20, 2019 3:46 pm IST

నాని నటించిన జెర్సీ , లారెన్స్ నటించిన కాంచన 3 నిన్న భారీ స్థాయిలో విడుదలయ్యాయి. ఇందులో జెర్సీ కి పాజిటివ్ రివ్యూస్ రాగ కాంచన 3 యావరేజ్ రేటింగ్స్ తో సరిపెట్టుకుంది. అయితేనేం దాదాపుగా జెర్సీ ఎంత రాబట్టిందో దానికి కొంచెం దూరంలో ఆగిపోయింది కాంచన 3.

ఈసిరీస్ లో వచ్చిన కాంచన , గంగ తెలుగు లో సూపర్ హిట్ అవ్వడంతో కాంచన 3 కి మంచి హైప్ వచ్చింది. అందుకు తగ్గట్లే మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5.60కోట్ల గ్రాస్ ను అలాగే 3.99 కోట్ల షేర్ ను రాబట్టింది. ముఖ్యంగా బిసి సెంటర్ల లో ఈ చిత్రం అదరగొడుతుంది.

ఇక ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులు ఠాగూర్ మధు సొంతం చేసుకోగా 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం ఫుల్ రన్ లో బ్రేక్ఈవెన్ ఆయ్యేలాగే వుంది.

సంబంధిత సమాచారం :