
తెలుగు సినిమాలో దర్శకుడు క్రిష్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’ ఇలా ఏ సినిమా చేసినా తనదైన బ్రాండ్ ఎమోషన్‌తో ఓ బలమైన కథ చెప్పే ప్రయత్నం చేస్తూంటారు. తాజాగా ఆయన రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యానికి ఓ ప్రేమకథను జోడించి తెరకెక్కించిన కంచె సినిమా ప్రపంచవ్యాప్తంగా గత వారాం విడుదలై విమర్శకుల ప్రశంసలను, బాక్సాఫీస్ కలెక్షన్స్‌నూ వసూలు చేస్తూ వెళుతోంది. ముఖ్యంగా ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ రానటువంటి నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో కంచె సినిమా ఒక ప్రత్యేకతను సొంతం చేసుకుంది.
ఇక విడుదలకు ముందునుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదల తర్వాత పూర్తి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌ను దాటేసి లాభాల బాట పట్టడమే కాకుండా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఇప్పటివరకూ యూఎస్‌లో ఈ సినిమా 425కే డాలర్లు వసూలు చేసి సూపర్బ్ అనిపించుకుంది. ఇక ఈ వారాంత ముగిసే సరికల్లా సినిమా హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంటుందని ట్రేడ్ వర్గాల సమాచారం. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు వీరిద్దరి కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది.

