ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వెళ్లనున్న ‘కంచె’.?

ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వెళ్లనున్న ‘కంచె’.?

Published on Oct 29, 2015 6:28 PM IST

kanche
ఒక సినిమాతో ఒకదానికి సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న క్రిష్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘కంచె’. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సినిమా చూసిన ప్రతి తెలుగు ప్రేక్షకుడి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. దాంతో ఇరు రాష్ట్రాల్లోనూ బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్స్ రేంజ్ పెరుగుతూ వస్తోంది. దాంతో గత కొద్ది రోజులుగా ఈ చిత్ర టీం సక్సెస్ టూర్ ని నిర్వహిస్తున్నారు. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇదిలా ఉంటె తాజా సమాచారం ప్రకారం క్రిష్ ఈ సినిమాని పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపడానికి సిద్దం అవుతున్నాడు. వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ లో రావడం ఈ సినిమాకి అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ బాగా హెల్ప్ అవుతుందని అందరూ సపోర్ట్ చేసి కంచె ని ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపమని క్రిష్ కి చెప్పారట. క్రిష్ కుడా దానికి సముఖ్యంగానే ఉన్నాడట. అన్నీ పర్ఫెక్ట్ గా జరిగితే కంచె సినిమాని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపవచ్చు. వరుణ్ తేజ్ ప్రాగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి చిరంతన్ భట్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు