
‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందేజగద్గురుమ్’ లాంటి విభిన్న కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ క్రిష్ ఈ సారి తెలుగు తెరపై మునుపెన్నడూ చూడని వరల్డ్ వార్ II ని మన ముందుకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ‘కంచె’. సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకోవడమే కాకుండా, సెన్సార్ వారి మన్ననలు కూడా పొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఒక్కరోజు మాత్రమే మిగిలింది. అనగా దసరా కానుకగా రేపు కంచె సినిమా థియేటర్స్ లో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయడానికి సిద్దమైంది.
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాకి ఇరు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇరు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రానున్నాయి. ఓవర్సీస్ లో ఈ సినిమా సుమారు 80 లొకేషన్స్ లో రిలీజ్ కానుంది. వరుణ్ తేజ్ కి ఇది రెండవ సినిమా, అలాగే మొదటి సినిమా సరిగా ఆడలేదు అయినప్పటికీ క్రిష్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ కి ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం సూపర్బ్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్ కి సూపార్బ్ రెస్పాన్స్ కూడా వస్తోంది. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఫస్ట్ ఫ్రేమ్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించనున్నాడు.

