బాలీవుడ్ లోకి రీమేక్ కానున్న కంచె.?

Kanche
తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఊహించని కథాంశం మరియు బ్యాక్ డ్రాప్ తో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన సినిమా ‘కంచె’. ఒక ప్రేమకథకి అలానాటి కుల వ్యవస్థని సమస్యగా సృష్టించి దానికి వరల్డ్ వార్ II నేపధ్యాన్ని కల్పించి చేసిన ఈ సినిమాకి విమర్శకుల నుంచి మంచి ప్రశంశలు దక్కాయి. అలాగే ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ క్రిష్ వర్క్ ని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలో క్రిష్ చూపించిన వార్ ఎపిసోడ్స్ హాలీవుడ్ సినిమాలను తలపిస్తుండడం సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. దసరా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్ ని సాధించింది.

వరల్డ్ వార్ II నేపధ్యంలో వచ్చిన మొదటి సినిమా కావడం వలన ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాలు కన్నేసాయి. అంతే కాదు అప్పుడే ఈ సినిమా అబోల్ల్య్వుడ్ లో రీమేక్ చెయ్యాలనే ఆలోచనలు కూడా మొదలైపోయాయి. ఇదే విషయాన్ని క్రిష్ కుడా ఖరారు చేసారు. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేలా ప్లాన్ చేస్తున్నామని త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తామని క్రిష్ తెలిపాడు. అలాగే మరో 15 రోజుల్లో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేయనున్నాడు క్రిష్.

Exit mobile version