జర్మన్‌ లోనూ రిలీజ్ కానున్న ‘కంచె’?

జర్మన్‌ లోనూ రిలీజ్ కానున్న ‘కంచె’?

Published on Nov 5, 2015 7:20 PM IST

kanche
‘కంచె’.. ఒక్క తెలుగు సినిమాకే కాక ఇండియన్ సినిమాకూ ఓ ప్రత్యేకతగా చెప్పబడుతూ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లనే కాక విమర్శకుల ప్రశంసలనూ అందుకుంటూ దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. తెలుగులో బలమైన భావోద్వేగాలతో నిండిన ‘గమ్యం’, ‘వేదం’ లాంటి మంచి సినిమాలను అందించిన దర్శకుడు క్రిష్, కంచె సినిమాను రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో నడిచే ఓ ప్రేమకథతో తెరకెక్కించి మళ్ళీ తన విలక్షణతను చాటుకున్నారు. ఇండియాలో మొట్టమొదటి రెండో ప్రపంచ యుద్ధ నేపథ్య సినిమాగా తెరకెక్కడం కంచె సినిమా విశిష్టతగా చెప్పుకోవచ్చు.

ఇక ఈ సినిమాకు ఉన్న యూనివర్సల్ అప్పీల్‌ను దృష్టిలో పెట్టుకొని కంచె టీమ్, పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ఈ సినిమాను పంపే ఆలోచన చేస్తోంది. అదేవిధంగా జర్మన్‌ భాషలో ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేసే ఆలోచనలో కూడా కంచె టీమ్ ఉంది. జర్మన్ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే కథాంశంతో వచ్చిన సినిమా కావడంతో అక్కడా ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ వైపుగా కంచె టీమ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్‌లు హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా త్వరలోనే తమిళ, హిందీ భాషల్లోనూ డబ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక 2015లో బాహుబలి, రుద్రమదేవి, కంచె సినిమాలతో తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా ప్రత్యేక సినిమాలను అందించిన పేరు దక్కడం విశేషంగానే చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు