కంచె ఫస్ట్ వీక్ నైజాం కలెక్షన్ రిపోర్ట్

కంచె ఫస్ట్ వీక్ నైజాం కలెక్షన్ రిపోర్ట్

Published on Oct 30, 2015 6:30 PM IST

kanche
ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని వరల్డ్ వార్ II అనే బ్యాక్ డ్రాప్ ని తీసుకొని దాని చుట్టూ ఓ అందమైన ప్రేమకథని అల్లుకొని చేసిన సినిమా ‘కంచె’. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంశలు వెళ్ళువెత్తాయి. ముఖ్యంగా ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు డైరెక్టర్ క్రిష్ మరియు యంగ్ హీరో వరుణ్ తేజ్ కి ఇండస్ట్రీలోనని అందరి ప్రముఖుల నుంచి అభినందనలు దక్కాయి. అలాగే బాక్స్ ఆఫీసు వద్ద కూడా డీసెంట్ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది.

నిన్నటితో మొదటి వారం రన్ పూర్తి చేసుకున్న కంచె సినిమాకి ఓవరాల్ గా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే కంచె సినిమాకి ఒక్క నైజాంలో మొదటి వారం 2.25 కోట్ల షేర్ ని సాధించింది. ఇక్కడే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా దాదాపు 3 కోట్ల షేర్ మార్క్ ని సాధించి అక్కడ పెద్ద హిట్ అనిపించుకుంది. వరుణ్ తేజ్ కాలేజ్ కుర్రాడిగా, మిలిటరీ కమాండోగా చూపిన నటనకి అందరూ నీరాజనాలు పడుతున్నారు. ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమా మొత్తం 1940 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది.

తాజా వార్తలు