ఆ బయోపిక్ కోసం తమిళ్ నేర్చుకుంటున్న స్టార్ హీరోయిన్ !

Published on Apr 16, 2019 5:10 pm IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి’ పురిచ్చి తలైవి’ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ‘తలైవి’ అనే బయోపిక్లో నటించడానికి సన్నద్ధం అవుతుంది. ఏ ఎల్ విజయ్ తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక ఈ చిత్రం కోసం కంగనా తమిళ్ నేర్చుకుంటుందట. సినిమాలో తన పాత్రకు ఆమె డబ్బింగ్ చెప్పుకోనుంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందిస్తున్న ఈ చిత్రాన్ని విబ్రి మీడియా పతాకం ఫై విష్ణు ఇందూరి నిర్మించనున్నారు. ఈచిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించనున్న ఈ చిత్రం హిందీలో జయ అనే టైటిల్ తో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :