కంగనా ‘క్వీన్’ మూవీ సంచలనాలు ఇంకా ఆగలేదు

Published on Jun 23, 2019 8:00 pm IST

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ రావ్ హీరోగా వికాస్ భల్ దర్శకత్వంలో తెరకెక్కిన “క్వీన్” ఘనవిజయం సాధించింది. 2014లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 100కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ లో బెస్ట్ మూవీస్ ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో కంగనా నటనకు మంచి మార్కులు పడటంతో పాటు,బాలీవుడ్లో ఆమె నిలదొక్కుకోవడానికి దోహదపడింది.

జాతీయ స్థాయిలో పలు అవార్లులు పొందిన ‘క్వీన్” మూవీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకొంది. చైనా బీజింగ్ లోగల భారత రాయబార కార్యాలయంలో గల ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు. ఈనెల 26 బుధవారం ఈ ప్రదర్శన జరగనుందని సమాచారం. ప్రస్తుతం తెలుగు,తమిళ ”క్వీన్” మూవీ రీమేక్స్ లో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More