యోగా టీచర్ కి కంగనా రనౌత్ కాస్ట్లీ గిఫ్ట్

Published on Jun 16, 2019 8:10 pm IST

కంగనా రనౌత్ పేరువింటే చాలు,సినిమా ప్రేక్షకులకు ఆమె చేసిన సినిమాలకంటే కూడా మొదట వివాదాలే గుర్తుకు వస్తాయి. ప్రభాస్ హీరోగా పూరి దర్శకత్వంలో “ఏక్ నిరంజన్” మూవీ లో కనిపించిన ఈ భామ బాలీవుడ్ లో “తను వెడ్స్ మను”,”క్వీన్”, “మణికర్ణిక” లాంటి చిత్రాలతో మంచి పేరు సంపాయించుకుంది. హిందీలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి బెస్ట్ ఆప్షన్ గా కంగనా పేరు చెవుతారు.

ఉన్నది ఉన్నట్లు గా ముక్కుసూటిగా చెప్పే కంగనా బాలీవుడ్ ప్రముఖులు చాలా మందితో గొడవలు పెట్టుకుంది. హృతిక్ రోషన్ కి ఈమెకి మధ్య గొడవ ఎంత సెన్సేషన్ అయ్యిందో మనకు తెలిసిందే, అలాగే ‘మణికర్ణిక’ మూవీ విషయంలో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తో కూడా ఆమె వ్యవహారం వివాస్పదం అయ్యింది. ఇలాంటి కంగనా చేస్తున్న కొన్ని పనులు చుస్తే ఈ గయ్యాళి భామకు ఇంత దయాహృదయం ఉందా అనిపిస్తుంది.

కంగనా తన యోగా టీచర్ కి 2.5 కోట్ల విలువైన ప్లాట్ ని గురుదక్షిణగా ఇచ్చిందంట.కేవలం యోగా టీచర్ కి అంత కాస్ట్లీ గిప్టా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. అలాగే తాను కొన్ని హాస్పిటల్స్ కట్టించి ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాని చెప్పారు. ఎవరికీ తెలియని ఈ ఆసక్తికర విషయాలు కంగనా ఇటీవల పత్రికా ముఖంగా పంచుకున్నారు. ఎప్పడూ వివాదాలలో ఉంటూ, కఠువుగా మాట్లాడే కంగనా మంచితనం గురించి అందరూ చర్చించుకుంటున్నారట.

సంబంధిత సమాచారం :

More