కంగనా రనౌత్ ఇకపై “మెంటల్ హై క్యా” కాదు

కంగనా రనౌత్ ఇకపై “మెంటల్ హై క్యా” కాదు

Published on Jun 29, 2019 2:15 PM IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ , హీరో రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మెంటల్ హై క్యా”. ఈ మూవీ టైటిల్ మానసిక వికలాంగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తీవ్ర అభ్యంతరం తెలపడంతో సెన్సార్ సభ్యులు టైటిల్ కి స్వల్ప మార్పులు చేయమని సూచించారట. దీనితో చిత్ర యూనిట్ మెంటల్ “హై క్యా” ని కాస్తా “జడ్జిమెంటల్ హై క్యా” అని మార్పు చేశారు. ఐనా మానసిక రోగుల మనోభావాలు దెబ్బతినడమేంటి మరీ కామెడీ కాకపోతేనూ.

బాలాజీ టెలీఫిల్మ్స్ పతాకం పై ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమైరా దస్తర్,జిమ్మీ షెర్గిల్,సతీష్ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తనిష్క్ బాఘ్చి,డివైన్,అర్జున హర్జాయి సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల 26న ప్రపంచ వ్యాప్తంగా భారీఎత్తున విడుదల చేయనున్నారు. ఇంతకు ముందు రాజ్ కుమార్ రావ్, కంగనా కాంబినేషన్ లో వచ్చిన “క్వీన్” మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు