తెలుగు లో రీమేక్ కానున్న కంగనా రనౌత్ చిత్రం ‘క్వీన్’

తెలుగు లో రీమేక్ కానున్న కంగనా రనౌత్ చిత్రం ‘క్వీన్’

Published on May 8, 2014 2:06 AM IST

kangna-ranaut
కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడం తో పాటు ఎంతో పెద్ద విజయాన్ని కూడా సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు లో రీమేక్ కావడానికి సిద్ధం గా వుంది. తెలుగు లో క్వీన్’ రీమేక్ చేయనున్నారని ఎపట్టి నుంచో వదంతులు వినిపిస్తునప్పటికీ ఈ విషయాన్ని ఇప్పుడు నిర్మాతలు స్పష్టం చేసారు.

నటీ నటులు ఇంకా ఖరారు కావాల్సిన ‘క్వీన్’ తెలుగు వెర్షన్ లో కంగనా రనౌత్ పాత్ర ని ఎవరు పోషిస్తారో చూడాలి. ‘క్వీన్’ చిత్రం చివరి నిమిషంలో తన పెళ్లి ఆగిపోవడం తో ఒంటరి గా యూరోప్ వెళ్లి తిరిగి సంతోషాన్ని సంపాదించిన ఒక ఢిల్లీ యువతి చుట్టూ తిరుగుతుంది. ‘క్వీన్’ నిర్మాతలు ఈ చిత్రం ఏ బాష లోనైనా ఒక యూనివర్సల్ కథ వుండడం వల్ల తిరుగులేని విజయం సాధిస్తుందని నమ్మకం గా వున్నారు.

తెలుగు లో చివరగా రీమేక్ అయిన చిత్రం ‘కహాని’ నయన తార శేఖర్ కమ్ముల లాంటి ప్రముఖులు పని చేసిన కాని బాక్స్ ఆఫీసు దగ్గర పెద్దగా విజయం సాధించలేదు. మరి తెలుగు ‘క్వీన్’ ఏ మాత్రం విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు