రక్తం మరిగిన కిల్లర్ లేడీగా మారిన హీరోయిన్ …!

Published on Aug 9, 2019 12:11 pm IST

ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వరుసగా లేడీ ప్రాధాన్య చిత్రాలు చేస్తూ బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇటీవల ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఆమె నటించిన జడ్జిమెంటల్ హై క్యా? మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఆమె తాజాగా నటిస్తున్న ధాకడ్ మూవీ టీజర్ ని నిన్న విడుదల చేశారు.

లేడీ రాంబోలా తయారైన కంగనా ప్రమాదకరమైన కిల్లర్ లేడీ లుక్ లో కనిపిస్తున్న ఆ టీజర్ అంచనాలకు మించి ఉంది. సింగిల్ గా మాఫియా సామ్రాజ్యన్ని మొత్తం అగ్నికి ఆహుతి చేస్తూ, శత్రువు గుండెల్లో వంద బెల్లెట్లు కసిగా దింపి, ముఖంపై చిందిన రక్తాన్ని నాలుకతో రుచి చూస్తున్న కంగనా ఆ టీజర్ లో గూస్ బంప్స్ కలిగిస్తుంది. టీజర్ చూస్తుంటే కంగనా ఈ చిత్రంతో పూర్తిస్థాయి యాక్షన్ ట్రీట్ ఇవ్వనుందని అర్థం అవుతుంది.

ఈ మూవీ యాక్షన్ సన్నివేశాల కొరకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ని పిలిపించే యోచనలో ఉన్నారట నిర్మాతలు. రజినీష్ ఘాయ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :