కంగనా ఆ చిత్రం కోసం నాలుగు లుక్స్ లో

Published on Sep 12, 2019 10:10 pm IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తమిళ రాజకీయ సంచలనం జయలలిత బయో పిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమై ఉన్నారు. దర్శకుడు ఏ ఎల్ విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కాగా జయలలిత బయో పిక్ కొరకు కంగనా తీవ్ర కసరత్తు మొదలుపెట్టారట. ఆమె నృత్యంలో శిక్షణ కూడా తీసుకుంటున్నారని సమాచారం.

ఐతే మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ బయోపిక్ లో కంగనా నాలుగు విభిన్న లుక్స్ లో కనిపించనున్నారట. జయలలిత జీవితంలోని నాలుగు ప్రధాన దశలలో ఆమె ఎలా ఉన్నారో అలా కంగనాను చూపించనున్నారట. అందుకే హాలీవుడ్ మేకప్ మెన్ జేసన్ కాలిన్స్ ఆధ్వర్యంలో ఆమె లుక్స్ పై టెస్టింగ్స్ మొదలుపెట్టారట. ఈయన హాలీవుడ్ లో కెప్టెన్ మార్వెల్, బ్లేడ్ రన్నర్ వంటి చిత్రాలకు పనిచేయడం గమనార్హం. దీపావళికి ముందు ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుందని సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More