ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీపై వ్యతిరేకత

Published on May 21, 2020 5:17 pm IST

ఒకప్పుడు పొగిడిన నోళ్లే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని విమర్శిస్తున్నాయి. కెజిఎఫ్ సినిమా ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమకు అపార గుర్తింపు తెచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆ సినిమా అన్ని భాషలలో సంచలన విజయం సాధించగా కన్నడ యంగ్ హీరో యష్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఒక్కసారి యష్ ఇమేజ్ దేశవ్యాప్తంగా పాకింది. మరి అలాంటి డైరెక్టర్ పై కన్నడ ప్రేక్షకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గెట్ లాస్ట్ ప్రశాంత్ నీల్ అనే యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

వారి కోపానికి కారణం, ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఒప్పుకోవడమే. నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తన ట్వీట్ ద్వారా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ కన్ఫర్మ్ చేశారు. టాలీవుడ్ పరిశ్రమకు చెందిన హీరోతో ప్రశాంత్ నీల్ మూవీ చేయడం వారికి నచ్చడం లేదు. అందుకు ఉదాహరణగా వారు శంకర్, రాజమౌళి పేర్లు ప్రస్తావిస్తున్నారు. అంత పెద్ద దర్శకులైన వారు ఇంత వరకు వేరే పరిశ్రమలకు చెందిన హీరోలతో సినిమా చేయలేదు. అలాంటిది ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో సినిమా ఎలా చేస్తాడు అని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More