బన్నీ ని కాపీ చేసిన కన్నడ హీరో !

బన్నీ ని కాపీ చేసిన కన్నడ హీరో !

Published on Aug 2, 2018 1:00 PM IST

Nikhil Kumar

బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘సరైనోడు’. 2016లో ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం బన్నీ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్నుసాధించిన చిత్రం గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈచిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు మాస్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను అలాగే కాపీ చేసి తన కొత్త సినిమాలో చూపించనున్నాడు యువ కన్నడ హీరో నిఖిల్.

ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న’ సీతారామ కళ్యాణ’ అనే కన్నడ చిత్రంలో బన్నీ సినిమా తాలూకు యాక్షన్ సన్నివేశాలు తోపాటు ఆయనను అనుకరించడానికి ప్రయత్నంచేశాడు నిఖిల్. మరి ‘సరైనోడు’ చిత్రాన్ని అక్కడ రీమేక్ చేస్తున్నాడో లేదో కానీ ఈ సీతారామ కళ్యాణ ట్రైలర్ చూస్తే మాత్రం సరైనోడు 2చూసినట్లే అనిపిస్తుంది. కాకపోతే ఈయాక్షన్ దృశ్యాలను ఇంతకుముందు కన్నడ ప్రేక్షకులు చూసి ఉండరు కాబట్టి నిఖిల్ కు ఈ సినిమా రూపంలో మంచి విజయం దక్కే అవకాశాలు ఉన్నాయి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు