విక్టరీ వెంకటేష్, మీన ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘దృశ్యం’. ఈ సినిమా మలయాళంలో ఇదే పేరుతో వచ్చిన మోహన్ లాల్ సినిమాకి రీమేక్.
ఈ సినిమా అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజస్ లో రిమేక్ చేస్తున్నారు. కన్నడలో రీమేక్ అయిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. మలయాళంలో లానే కన్నడలో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది.
కన్నడ సినిమా హిట్ తెలుగు సినిమా మేకర్స్ లో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ సినిమా రెండు భాషల్లోనూ హిట్ గా నిలిచింది అంటే ఇందులో యూనివర్సల్ కి నచ్చే కాన్సెప్ట్ ఉందని అర్థం చేసుకోవచ్చు. శ్రీ ప్రియ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎక్కువగా సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నాయి. ఈ సినిమాపై వెంకటేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.


