టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న కన్నడ స్టార్ యాక్టర్ !

Published on Apr 23, 2019 3:38 pm IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కోలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ అన్నామలై తో హీరో అనే సినిమా చేయనున్నాడు. బైక్ రేస్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం మే లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దిగంత్ ముఖ్య పాత్రలోనటించనున్నాడు. దాదాపుగా 10 సంవత్సరాల తరువాత ఈ నటుడు టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇంతకుముందు ఎమ్మెస్ రాజు నిర్మాణం లో వచ్చిన వాన చిత్రంలో నటించాడు దిగంత్. ఇక హీరో తెలుగు తోపాటు తమిళం ,కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటించనుంది.

సంబంధిత సమాచారం :